YSRCP: చిలకలూరిపేట, తాడికొండ సమన్వయకర్తల నియామకం

0
2

ఓటమి తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు నియోజకవర్గ సమన్వయకర్తల ఎంపిక చేస్తోంది. దీనిలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీనిలో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమిస్తున్నట్లు ప్రకటించింది.