Andhra Pradesh

Vijayawada Landslide: కొండచరియలు విరిగిపడిన ప్రాతంలో హోమ్ మంత్రి అనిత పర్యటన..

ఎడతరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మొఘల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీదు పక్కన కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు.

విజయవాడలో మొఘల్రాజపురం ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను హోం మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు.