ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా ఉద్ఘంట రేపుతుంది అని మాత్రం చెప్పవచ్చు.
ఒకవైపు నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తూ నరసాపురం పార్లమెంట్ స్థానం ఆశించిన RRRగా చెప్పబడే రఘురామ రామకృష్ణ రాజు టిడిపి తరపున టికెట్ దక్కించుకోగా, తెలుగుదేశం టికెట్ ఆశించిన శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక వైసీపీ తరపున నరసింహ రాజు పోటీ చేశారు. ముగ్గురూ క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన రారు కావడం గమనార్హం!
అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శివరామరాజుకు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఆయన అందరినీ మంచిగా పలకరిస్తారు అని, గతంలో అభివృద్ది చేశారు అనే గుర్తింపు ఉంది. దీనితో దాదాపు నాలుగు మండలాల ప్రజలు ఆయన వెంట నడిచినట్లు తెలుస్తోంది.
ఇక పట్టణ వోటర్, యువకులు రఘురామ రామకృష్ణ రాజు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గ్రామీణ వోటర్లలో కొద్ది శాతం, ఎస్సీ వోటర్లు వైసీపీ వెంట నిలిచారు.
రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన పోలింగ్ లో 82 శాతం ఓటింగ్ జరిగినట్లు ప్రాధమికంగా చెపుతున్నారు. భారీగా జరిగిన పోలింగ్ ఎవరికి విజయం తెచ్చిపెడుతుందో తెలియాలంటే జూన్ 4 వరకూ వేచిచూడాలి.