ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తారని ఆశతో ఏరికోరి వైఎస్ షర్మిలను ఏపికి పంపిన హైకమాండ్ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నట్లే అనిపిస్తోంది. కొద్ది రోజుల్లో ఆమె స్థానంలో క్రొత్త పీసీసీ చీఫ్ ను నియమించడానికి కసరత్తు చేస్తోందట!
గత ఎన్నికల ముందు వైఎస్సార్ తెలంగాణా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత… ఏపిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు పేరుతో వైఎస్ షర్మిలను పిసిసి చీఫ్ గా రాష్ట్రానికి పంపింది ఆ పార్టీ అధిష్టానం. అయితే పార్టీకి ఆమె ఉపయోగ పడకపోగా.. పార్టీని అడ్డం పెట్టుకుని తన వ్యక్తిగత ఎజెండాతో ప్రతీ వేదికపై జగన్ పైనే దుమ్మెత్తి పోస్తూ వస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్నా తప్పులను ఎత్తి చూపకపోగా మరో ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయడం నచ్చని అనేక నాయకులు అధిష్టానానికి పిర్యాదులు చేసారు. అంతేకాదు పేరున్న కొద్ది నాయకులు కూడా షర్మిల తీరుపై గుర్రుగా ఉండి.. కొందరు పార్టీకి గుడ్ బై చెప్పడమో … సైలెంట్ గా ఉండడమో చేస్తూ వస్తున్నారు.
షర్మిల వ్యవహారంపై విచారణ జరిపిన డిల్లీ పెద్దలకు ఆమె వ్యవహారం అర్ధం అయినట్లే ఉంది. ఆమె స్థానంలో క్రొత్త పీసీసీ చీఫ్ ఎంపికకు రంగం సిద్దం చేసినట్లు కొందరు నాయకులు చెపుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న కిల్లి కృపారాణిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నిమమించబోతున్నట్లు కొందరు చెపుతున్నారు.
విషయం తెలిసిన షర్మిల ఇప్పటికే సైలెంట్ అయ్యారు.. అధిష్టానం తొలగించేలోగా తానే రాజీనామా చెయ్యడమో.. పార్టీని వీడడమో చెయ్యాలని యోచిస్తున్నారట! అందుకే ఇటీవల ఎన్నికల కమిషన్ పై బాంబ్ పేల్చిన రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడం.. ట్వీట్ చెయ్యడం వంటివి కూడా చెయ్యలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కిల్లి కృపారాణి ఎంపిక వెనుక వేరే కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వైఎస్ సన్నిహితురాలైన కృపారాణి ద్వారా ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం చెయ్యొచ్చని..తద్వారా జగన్ కు సన్నిహితం అయ్యే అవకాశం చేజారదని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆ విషయంపై పూర్తి అవగాహన రావడానికి కేవలం కొద్ది రోజులే వేచి ఉంటే సరిపోతుంది