Pinnelli EVM Case: పిన్నెల్లిపై కేసులో పెద్ద తలకాయలు? .. కేసు సంచలనం కానుందా ..

Photo of author

Eevela_Team

Share this Article

పోలింగ్‌ కేంద్రంలో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను
ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మేము ఆ వీడియో విడుదల చేయలేదు అని చెప్పడం కేసు కథ మలుపులు తిరిగేలా ఉంది. పిన్నెల్లిపైన పెట్టిన కేసుల ప్రకారం ఆయనకు 7 ఏళ్లు జైలు శిక్ష పడనుంది అని అధికారులు చెప్పారు. 

అయితే ఎన్నికలు ముగిశాక మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా 11 చోట్ల ఈవీయంలు ద్వంసం అయ్యాయి అని అయితే డేటా భద్రం గానే ఉంది అని .. రీపోలింగ్ అవసరం లేదు చెప్పారు. మరి 11 చోట్ల ఈవీయంలు ద్వంసం అయితే ఒక్క పిన్నెల్లి వీడియో మాత్రం ఎలా లీక్ అయింది. ఈ వీడియో మొదట టిడిపి సోషల్ మీడియాలో .. లోకేష్ ట్విట్టర్ నుంచి రావడం దీని వెనక ఎవరున్నారు. ఇది నిజం వీడియోనా ? మార్ఫింగ్ చేశారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. 

అంటే కాదు ఈ వీడియో మొత్తాన్ని బయట పెడితే అసలు నిజాలు తెలుస్తాయి అని, అలాగే మిగతా 10 చోట్ల జరిగిన సంఘటనల వీడియోలను కూడా బయట పెట్టాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడ
పోలింగ్‌ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఫిర్యాదు
చేసేందుకు పోలింగ్‌ అధికారి ముందుకు కాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు
కంట్రోల్‌ ప్యానల్, వీవీ ప్యాట్‌ లను ధ్వంసం చేశారని స్థానిక వీఆర్వో
ఈనెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లూ దీనిలో
ప్రస్తావించలేదు. 

మొత్తానికి  ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. దీని విచారణలో క్రొత్త విషయాలు బయట పడొచ్చు. తాము వీడియో బయటకు రిలీజ్ చేయలేదు అని ఎన్నికల కమిషన్ చెప్పడంతో .. ప్రస్తుతం ఆ వీడియో ఎలా బయటికి వచ్చింది.. ఎన్నికల కార్యక్రమాల బద్రత.. అధికారుల నిర్లక్ష్యం.. అన్నీ బయట పడే అవకాశం ఉంది.

మొత్తం వీడియో కోర్టుకి సమర్పించాలి అని అప్పటిదాకా పిన్నెల్లి అరెస్ట్ వద్దు అని కోర్టు చెపితే ఎన్నికల కమిషన్ అడ్డంగా బుక్ అవడం ఖాయం..

Join WhatsApp Channel
Join WhatsApp Channel