Andhra PradeshPolitics

Vangalapudi Anitha: హోమ్ మంత్రి అనితకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్..

హోమ్ మంత్రి వంగలపూడి అనిత మంత్రిపదవి కోల్పోబోతున్నారా? శాంతిభద్రతల అదుపులో ఆమె విఫలం అయ్యారని పవన్ భావిస్తున్నారా?

ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు తీవ్రంగా విఫలం అయ్యారని.. చెపుతూ .. “అనిత గారూ! మీరు హోమ్ మంత్రిగా బాధ్యత వహించాలి అని ఒకవేళ నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి ..మమ్మల్ని విమర్శించే వారిని.. మీరు ఇలాగే ఏమీ చేయకుండా ఉంటే నేను హోమ్ శాఖ తీసుకోవాల్సి ఉంటుందని” హెచ్చరించారు.

అయితే ఇప్పటికే వంగలపూడి అనిత తన స్వంత నాయకుల నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.. ఆమెను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగిస్తారు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.. ఇటువంటి పరిస్థితిలో పవన్ వ్యాఖ్యలు ఆ శాఖ పై కర్చీఫ్ వేసినట్లే అని అనుకోవాలని కొందరు భావిస్తున్నారు.