Palnadu Road Accident: ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్దం .. ఆరుగురి సజీవ దహనం

Palnadu Road Accident: ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్దం .. ఆరుగురి సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల
మధ్య ఈవూరివారిపాలెం జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు దగ్గర ఘోర
ప్రమాదం చోటు చేసుకుంది. ట్రవెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, టిప్పర్‌
డ్రైవర్‌, నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు
అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. 

బస్సులో
నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం కనిపించింది. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై 108, పోలీసులకుస సమాచారం అందించారు. వెంటనే
వారంత అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ వెంటనే చీరాల,
యద్దనపూడి, చిలకలూరిపేట, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాదం జరిగిన
ప్రాంతానికి వచ్చాయి. ట్రావెల్స్‌ బస్సులో చిక్కుకుపోయిన వారిని జాగ్రత్తగా
బయటకు తీశారు.. వారిని 108 వాహనాల్లో 20 మంది వరకు గాయపడినవారిని
చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్
సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి. బైపాస్‌ పనులు జరుగుతుండటంతో.. అయితే అక్కడ
తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు.
టిప్పర్‌ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్‌ డ్రైవర్ కంట్రోల్ చేయలేక
బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు.

బస్సు చినగంజాం
నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ  ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల
జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు.
వీరిలో చాలామంది ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తున్నారు. 

గాయపడి వారిని గుంటూరులోని
ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో
ఇద్దరు ప్రయాణికుల జాడ ఇంకా లభ్యం కాలేదని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే
అవకాశం ఉంది.

మృతుల వివరాలు..
అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా
ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.

Join WhatsApp Channel