MLC Results: కూటమికి తొలి ఎదురు దెబ్బ… ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రఘువర్మ ఓటమి

Photo of author

Eevela_Team

Share this Article

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు బలపర్చిన పాకలపాటి రఘువర్మ ఓటమి అంగీకరించారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అయితే ఈ ఎన్నికలో బిజెపి బలపర్చిన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందడం గమనార్హం. రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన విజయం సాధించారు. తన ఎన్నికను రాజకీయాలతో ముడిపెట్టవద్దని తర్వాత ఆయన విలేఖర్ల సమావేశంలో చెప్పారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel