ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు సంబంధిత కోర్టుకు చేరలేదు. దీంతో శుక్రవారం ఆయన విడుదల సాధ్యపడలేదు.
రెండో శని వారాల, అది వారాల వరుస సెలవులు ఆయన విడుదలకు అడ్డంకిగా మారాయి. ఆయన సోమవారం వరకు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులను పొందేందుకు ప్రయత్నించనున్నారు. అన్నీ అనుకూలిస్తే, సోమవారం సాయంత్రం నాటికి కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.