Kodi Katti Case : జగన్ పై దాడి చేసిన జనపల్లి శ్రీనుకు ఏపీ హైకోర్టు బెయిల్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట ల‌భించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ లభించింది. 

Kodi Katti Case : జగన్ పై దాడి చేసిన జనపల్లి శ్రీనుకు ఏపీ హైకోర్టు బెయిల్

 

బెయిల్ కోసం రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని తెలిపింది. ఈ కేసుపై మీడియాతో మాట్లాడద్దొని నిందితుడికి న్యాయస్థానం ఆదేశించింది.

2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును ఎన్ఐఏ కి అప్పజెప్పారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాకపోవడంతో గత ఐదేళ్లుగా శ్రీనివాస్‌ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడని లాయర్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Join WhatsApp Channel