Jagananna Ammavodi 2024 Date: అమ్మఒడి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే…

Photo of author

Eevela_Team

Share this Article

 

జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఇస్తున్నఅమ్మఒడి పథకం కు సంబంధించి  2023–24 విద్యా సంవత్సరానికి
సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి త్వరలో జమచేయనున్నారు. 

వేసవి సెలవుల అనంతరం,జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల­లు
పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు
పుస్తకాలను అందజేయాలని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే జూన్ నాలుగవ వారంలో అమ్మవొడి నిధులను తల్లుల ఖాతాల్లో జ‌మ చేస్తారు..  

నిజానికి  అమ్మవొడి పథకం జగన్ ప్రభుత్వానికి చెందినది. ఈ పథకం కొనసాగాలంటే తిరిగి వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉంది. మే 13 న అసెంబ్లీకి జరికిన ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదల అవుతాయి. ఒకవేళ తిరిగి జగన్ సీయంగా అధికారం చేపడితేనే ఆ పథకం నిధులు తల్లుల ఖాతాలో పడతాయి. 

అయితే చంద్రబాబు నాయుడి కూడా తల్లికి వందనం పేరుతో ఇదే తరహా పథకాన్ని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. కనుక చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఏడే తరహా పథకం నిధులు తల్లులకు అందె అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.

Join WhatsApp Channel
Join WhatsApp Channel