YS Jagan: పల్నాడు టూర్ గ్రాండ్ సక్సెస్.. కూటమికి షాక్

అనేక ఆంక్షల మధ్య వైసీపీ అధినేత జగన్​ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రెంటపాళ్లలో చనిపోయిన ఆ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసుకు అనేక ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు, 100 మంది వ్యక్తులకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లేదారిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులను మూసివేశారు. అయితే వారి ఆంక్షలు బేఖాతరు చేస్తూ జగన్ వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

ఈ పర్యటనలో జగన్ నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించి, విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

“రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని.. పోలీసుల వేధింపులతోనే తమ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని” జగన్ ప్రస్తావించారు.

Join WhatsApp Channel