Free Power: గణేష్ మండపాలకు ‘ఉచిత విద్యుత్’… ప్రభుత్వం సంచలన నిర్ణయం

గణేష్ మండపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి, దసరా నవరాత్రులలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

వినాయక చవితి ఉత్సవం సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. ఈ పిటిషన్ పై స్పందించిన మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్చలు జరిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు అవుతాయని అంచనా వేసారు. ఈ తోమ్మిది రోజులకు పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వానికి రూ.25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.అయితే రాష్ట్రంలోని లక్షలాది గణేష్ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మంత్రి నారా లోకేష్ చేసిన సూచనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ అభ్యర్థనను స్వీకరించి, ముఖ్యమంత్రి ప్రత్యేక జె.ఓ. జారీ చేయాలని ఆదేశించారు. రాబోయే విజయదశమి ఉత్సవాల్లో దుర్గా దేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Join WhatsApp Channel