Andhra PradeshEducation

AP POLYCET Results 2024 విడుదల; ఏపీ పాలిసెట్‌ ర్యాంక్‌ కార్డు


ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు
: సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.. మొత్తం 1.42లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1.24లక్షల మంది అర్హత పొందారు. 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.

ఫలితాలతో పాటు ర్యాంక్‌ కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాలిసెట్‌ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మొత్తం 267 ఉండగా, వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తేదీలకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్‌ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

AP Polycet Results 2024