Andhra PradeshEducationJobstrending

AP Mega DSC: మెగా డీఎస్సీ ఈ నెలలోనే..

ఆంధ్ర ప్రదేశ్ లో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపద్యంలో డీఎస్సీ 2025 పై కీలక ప్రకటన వెలువడింది.

ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ నిర్వహించిన సమావేశంలో… మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, పిల్లలకు ఇచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు. హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీఓ-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.