ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు కొద్ది సేపట్లో విడుదల అవుతున్నాయి. తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను 11 గంటలకి విడుదల చేస్తున్నారు.
మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు.. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు ఫీజు చెల్లించగా ఫస్టియర్ విద్యార్ధులు 5,17,617 మంది, సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,35,056 మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. వీరిలో 52,900 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.