AP IAS Transfers: ఏపీలో ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఏపీలో ఏడుగురు IAS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్‌లుగా నియమించారు. నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ, మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత, అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన, అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Join WhatsApp Channel