Andhra Premier League 2025 Live: అట్టహాసంగా మొదలైన ఏపీఎల్‌-4… షెడ్యూల్ ఇదే

రాష్టానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్-4 (ఏపీఎల్‌-4) విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. నగరంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్‌-4 ట్రోఫీని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 8 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న ప్రారంభోత్సవ వేడుకలో ఎంపీలు కేశినేని చిన్ని, శ్రీభరత్‌, ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ పాల్గొన్నారు. ఈ సీజన్‌లో 7 జట్లు 25 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ జట్ల పేర్లు – రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, మరియు సింహాద్రి వైజాగ్ లయన్స్.

గత సీజన్లలో బాగా ఆడిన కొందరిని IPL లో కూడా తీసుకున్నారు. దీనితో ఆడగాళ్ళు కూడా ఈ మ్యాచ్ లలో తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. సత్యనారాయణ రాజు మరియు పైలా అవినాష్ గత సీజన్ నుండి MI మరియు PBKS ఫ్రాంచైజీలతో తమ మొదటి IPL ఒప్పందంపై సంతకం చేసిన ఇద్దరు APL క్రీడాకారులు..

Andhra T20 Premier League: Kakinada Kings Vs Amaravati Royals

ప్రారంభ మ్యాచ్ లో ఈరోజు కాకినాడ కింగ్స్ అమరావతి రాయల్స్‌తో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ 4 , సోనీ స్పోర్ట్స్ 5 చానల్స్ లో చూడవచ్చు.

తొలి మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కడపటి వార్తలు అందేసరికి అమరావతి రాయల్స్‌ ౩ ఓవర్లలో 42 పరుగులు చేసింది.

Andhra Premier League APL-4 Schedule

మ్యాచ్ నంబర్తేదీమ్యాచ్ ఆడే జట్లుసమయం (IST)
18 ఆగస్టుకాకినాడ కింగ్స్ vs అమరావతి రాయల్స్రాత్రి 7:30
29 ఆగస్టువిజయవాడ సన్‌రైజర్స్ vs రాయల్స్ ఆఫ్ రాయలసీమమధ్యాహ్నం 1:30
39 ఆగస్టుతుంగభద్ర వారియర్స్ vs వైజాగ్ లయన్స్సాయంత్రం 6:30
410 ఆగస్టుకాకినాడ కింగ్స్ vs విజయవాడ సన్‌రైజర్స్మధ్యాహ్నం 1:30
510 ఆగస్టుభీమవరం బుల్స్ vs రాయల్స్ ఆఫ్ రాయలసీమసాయంత్రం 6:30
611 ఆగస్టుఅమరావతి రాయల్స్ vs తుంగభద్ర వారియర్స్మధ్యాహ్నం 1:30
711 ఆగస్టువైజాగ్ లయన్స్ vs కాకినాడ కింగ్స్సాయంత్రం 6:30
812 ఆగస్టుభీమవరం బుల్స్ vs అమరావతి రాయల్స్మధ్యాహ్నం 1:30
912 ఆగస్టువిజయవాడ సన్‌రైజర్స్ vs వైజాగ్ లయన్స్సాయంత్రం 6:30
1013 ఆగస్టురాయల్స్ ఆఫ్ రాయలసీమ vs తుంగభద్ర వారియర్స్మధ్యాహ్నం 1:30
1113 ఆగస్టువిజయవాడ సన్‌రైజర్స్ vs భీమవరం బుల్స్సాయంత్రం 6:30
1215 ఆగస్టువైజాగ్ లయన్స్ vs రాయల్స్ ఆఫ్ రాయలసీమమధ్యాహ్నం 1:30
1315 ఆగస్టుభీమవరం బుల్స్ vs తుంగభద్ర వారియర్స్సాయంత్రం 6:30
1416 ఆగస్టుఅమరావతి రాయల్స్ vs వైజాగ్ లయన్స్మధ్యాహ్నం 1:30
1516 ఆగస్టుతుంగభద్ర వారియర్స్ vs కాకినాడ కింగ్స్సాయంత్రం 6:30
1617 ఆగస్టువైజాగ్ లయన్స్ vs భీమవరం బుల్స్మధ్యాహ్నం 1:30
1717 ఆగస్టురాయల్స్ ఆఫ్ రాయలసీమ vs కాకినాడ కింగ్స్సాయంత్రం 6:30
1818 ఆగస్టుతుంగభద్ర వారియర్స్ vs విజయవాడ సన్‌రైజర్స్మధ్యాహ్నం 1:30
1918 ఆగస్టురాయల్స్ ఆఫ్ రాయలసీమ vs అమరావతి రాయల్స్సాయంత్రం 6:30
2019 ఆగస్టుకాకినాడ కింగ్స్ vs భీమవరం బుల్స్మధ్యాహ్నం 1:30
2119 ఆగస్టుఅమరావతి రాయల్స్ vs విజయవాడ సన్‌రైజర్స్సాయంత్రం 6:30
2221 ఆగస్టుTBC vs TBC, ఎలిమినేటర్మధ్యాహ్నం 1:30
2321 ఆగస్టుTBC vs TBC, క్వాలిఫైయర్ 1సాయంత్రం 6:30
2422 ఆగస్టుTBC vs TBC, క్వాలిఫైయర్ 2సాయంత్రం 6:30
2523 ఆగస్టుTBC vs TBC, ఫైనల్సాయంత్రం 6:30
Join WhatsApp Channel