తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకు తింటున్నదని, అందరికీ అన్యాయం జారిందని తాము వస్తే సమర్ధవంతమైన ప్రజా పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.
దోచుకున్న సొమ్ముతో “సిద్ధం” అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు పెడుతున్నారు అని, మద్యపానం నిషేదించక పోతే మళ్ళీ వోటు అడిగే అర్హత జగన్ కి లేదు అని చంద్రబాబు అన్నారు.