ఏపి సచివాలయం తాకట్టు వార్తలో నిజం లేదు : ఏపీ సీఆర్డీఏ వివరణ

సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ: 03.03.2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. ఈరోజు విడుదల చేసిన ఒక నోటిస్ లో ఈ తప్పుడు కథనంపై తాము ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఏపి సచివాలయం తాకట్టు వార్తలో నిజం లేదు : ఏపీ సీఆర్డీఏ వివరణ

 

ఈ లేఖలో ఉన్న వివరాలు యధాతధంగా –

రాష్ట్ర సాధారణ పరిపాన శాఖ నుంచి ఈవిషయమై ఏపీ సీఆర్డీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించటం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్ఎస్సీ బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడడిఎఫేసీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీని ఎటువంటి రుణాన్ని పొందియుండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నివేదించటం జరిగింది. రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని కనార్టియం బ్యాంకులు అయినటువంటి (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు) మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీకు రిలీజ్ చేయటం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో రూ.1.151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయటం జరిగింది.. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమూ పొందియుండలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు. చేయటం జరుగుతుంది.

ఒక విధంగా చూస్తే ఒక వర్గం మీడియా కావాలని ఈ వార్తను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. టిడిపి మద్దతుడారులైన మీడియా చానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ చానల్స్ తో పాటూ సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వై యస్ జగన్ పై నిప్పులు చెరిగారు.ఒక దశలో మోడీ కూడా జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆ మీడియా రాసింది. ఒక అసత్య వార్తను పట్టుకుని ఈ విధంగా ప్రచారం చేయడం, టిడిపి పార్టీ కూడా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

“సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం

-ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సీఆర్డీఏ) pic.twitter.com/aCxs2hIYvv

— Rahul (@2024YCP) March 3, 2024

Join WhatsApp Channel