టీటీడీ వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మే 14, 2026న టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి ఎ. శరత్ అధికారిక ప్రకటన జారీ చేశారు. వేదాలు, ఆగమాలు, స్మార్తం వంటి వివిధ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను… ...

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మే 14, 2026న టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి ఎ. శరత్ అధికారిక ప్రకటన జారీ చేశారు. వేదాలు, ఆగమాలు, స్మార్తం వంటి వివిధ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ప్రవేశాలు కల్పించే వేద పాఠశాలల వివరాలు:

  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, ధర్మగిరి, తిరుమల (తిరుపతి జిల్లా).
  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, కోటప్పకొండ (గురవయ్యపాలెం, పల్నాడు జిల్లా).
  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, ఐ.భీమవరం (ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా).
  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, విజయనగరం (రామనారాయణం, సారిక).
  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, కీసరగుట్ట (మేడ్చల్ జిల్లా, తెలంగాణ).
  • శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం, నల్గొండ (పానగల్, తెలంగాణ).

అర్హతలు, కోర్సుల కాలపరిమితి:

  • 10, 12 ఏళ్ల కోర్సులు: ఋగ్వేదము, శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము, సామవేదము తదితర కోర్సులకు దరఖాస్తు చేసే విద్యార్థులు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యార్థులు 01.07.2014 నుండి 30.06.2016 మధ్య జన్మించిన వారై ఉండాలి.
  • 7, 8 ఏళ్ల కోర్సులు: ఆగమాలు (శైవ, పాంచరాత్ర, వైఖానస తదితర), స్మార్తం, దివ్యప్రబంధము కోర్సులకు దరఖాస్తు చేసే విద్యార్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీరు 01.07.2012 నుండి 30.06.2014 మధ్య పుట్టిన వారు అయి ఉండాలి.
  • ఉపనయనం తప్పనిసరి: విద్యార్థులకు సంప్రదాయబద్ధంగా వారి వేదశాఖ లేదా సూత్రము ప్రకారం తప్పనిసరిగా ఉపనయన సంస్కారము అయివుండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం: అర్హత గల విద్యార్థులు తాము చేరదలచిన శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంకి చెందిన ‘శ్రీయుత ప్రధానాధ్యాపకులు’ పేరిట సంబంధిత చిరునామాకు దరఖాస్తులు పంపవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ వివరాలకు: www.tirumala.org

Join WhatsApp Channel