మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? లెబనాన్‌పై తాము అవసరమైతే సైనిక దాడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారని ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు వెల్లడించారు.
ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నెతన్యాహు పదేపదే చెబుతున్నారు. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా (Hezbollah) ఉగ్రవాదులను అణచివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన సంప్రదింపుల్లో ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు నెతన్యాహు పేర్కొన్నారని ‘మిడిల్ ఈస్ట్ మానిటర్’ పత్రిక వెల్లడించింది.
“ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నా అమెరికా పూర్తి మద్దతు ఇస్తుంది. లెబనాన్‌పై దాడుల విషయంలో మాకు స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ లభించింది” అని నెతన్యాహు తన కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు ఈ పత్రిక రాసింది.

