16.2 C
Hyderabad
Monday, December 29, 2025
HometrendingAadhar PAN Alert: డిసెంబర్ 31 లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే కష్టమే.. ఆ తర్వాత...

Aadhar PAN Alert: డిసెంబర్ 31 లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే కష్టమే.. ఆ తర్వాత మీ కార్డు చెల్లదు!

హైదరాబాద్: మీరు ఇంకా మీ ఆధార్ కార్డును పాన్ (PAN) కార్డుతో లింక్ చేయలేదా? అయితే ఈ వార్త మీ కోసమే. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, డిసెంబర్ 31, 2025 లోపు పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ గడువు ముగిసిన తర్వాత, అంటే జనవరి 1, 2026 నుండి లింక్ చేయని పాన్ కార్డులు ‘ఇన్‌ఆపరేటివ్’ (Inoperative) లేదా నిరుపయోగంగా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువు ముఖ్యంగా అక్టోబర్ 1, 2024 కంటే ముందు ‘ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి’ (Aadhaar Enrolment ID) ద్వారా పాన్ కార్డు పొందిన వారికి వర్తిస్తుంది.

పాన్ కార్డు పని చేయకపోతే ఏమవుతుంది?

ఒకవేళ మీ పాన్ కార్డు ఇన్‌ఆపరేటివ్‌గా మారితే, మీరు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే, మీరు ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయలేరు. పెండింగ్‌లో ఉన్న టాక్స్ రీఫండ్లు మీ ఖాతాలోకి రావు, నిబంధనల ప్రకారం, మీ ఆదాయంపై కోత విధించే టీడీఎస్ లేదా టీసీఎస్ (TCS) సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో (దాదాపు 20%) ఉంటుంది, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం, క్రెడిట్ కార్డుల దరఖాస్తు, మరియు భారీ నగదు లావాదేవీలు చేయడం అసాధ్యం అవుతుంది. అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ పెట్టుబడులు మరియు బీమా పాలసీల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడతాయి.

ఆన్‌లైన్‌లో లింక్ చేయడం ఎలా? 

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, మీరు ఇంటి వద్ద నుండే సులభంగా ఈ పనిని పూర్తి చేయవచ్చు:

  1. ముందుగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చెయ్యండి.
  2. హోమ్‌పేజీలో ఎడమవైపు ఉన్న ‘Quick Links’ విభాగంలో ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. మీ 10 అంకెల పాన్ నంబర్ మరియు 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ‘Validate’ బటన్ నొక్కండి.
  4. మీరు ఇప్పటికే గడువు దాటినట్లయితే, రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘e-Pay Tax’ ద్వారా పేమెంట్ పూర్తి చేయండి.
  5. పేమెంట్ పూర్తయిన తర్వాత, మీ పేరు (ఆధార్‌లో ఉన్నట్లుగా) మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే 6 అంకెల OTP ని ఎంటర్ చేసి ‘Link Aadhaar’ పై క్లిక్ చేయండి.
  6. మీ రిక్వెస్ట్ సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి ‘Link Aadhaar Status’ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఎవరికి మినహాయింపు ఉంది?

కొన్ని ప్రత్యేక వర్గాలకు ఆధార్-పాన్ లింకింగ్ నుండి మినహాయింపు ఇచ్చారు:

  • 80 ఏళ్లు పైబడిన వారు (అతి సీనియర్ సిటిజన్లు).
  • ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ‘నాన్-రెసిడెంట్’ (NRI) హోదా ఉన్నవారు.
  • భారత పౌరసత్వం లేని విదేశీయులు.
  • అస్సాం, మేఘాలయ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన నివాసితులు.

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel