26.2 C
Hyderabad
Monday, December 29, 2025
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ! జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ! జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్టణం ఉంటుందని.. తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నగరంలో జరిగిన “విజన్ విశాఖ” కార్యక్రమంలో మాట్లాడిన  సీఎం జగన్, రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు 90శాతం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని అన్నారు. అలాగే రానున్న కాలంలో తాను మరోసారి సీఎంగా వచ్చి విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక నా వ్యక్తిగత స్వార్ధమేమి లేదని చెప్పుకొచ్చారు.

అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్‌ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు.

బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు.

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel